Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

టిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నేత…

ktr

నిజామాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఇతర సంఘాల వారు గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా బిజెపి సీనియర్ నేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ మధుశేఖర్ టిఆర్‌ఎస్‌ గూటికి చేరారు. టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మధుశేఖర్‌ను ఐటిశాఖ మంత్రి కెటిఆర్, ఎంపి కవిత సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మధుశేఖర్ మాట్లాడారు. దళితుల ఆకాంక్షలు సిఎం కెసిఆర్ పాలనలో నెరవేరుతున్నాయని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సిఎం చేపట్టారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎంఎల్ఎలు,  పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

comments