Home మెదక్ రైతన్నకు అండగా ఉంటాం

రైతన్నకు అండగా ఉంటాం

టిడిపి, బిజెపి నాయకుల భరోసా …
రైతులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ సర్కార్ విఫలం …
Famers2గజ్వేల్ : కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్ సర్కార్ విఫలమైందని, ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతులకు అండగా నిలుస్తామని టిటిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డిలు పేర్కొన్నారు. రైతు సమస్యలపై తెలంగాణ తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి గజ్వేల్‌లోని సహకార బ్యాంక్ స మీపంలో మంగళవారం చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షకు వారు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయడంతో పా టు రైతులకు అండగా ఉండటానికి భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకో వాలన్నారు. రైతు సమస్యను పరిష్కరించడంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మీన వేశాలు లెక్కపెడుతుండని టిటిడిపి రైతు అధ్యక్షులు బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. స్వయానా ముఖ్యమంత్రి ఇలాఖాలోనే రోజు కొక రైతు మరణిస్తున్నా వారిని కాపాడే ప్రయత్నా లు చేయడం లేదని, యదా రాజ తదా ప్రజ అన్నట్లు తెలంగాణ మొత్తం రైతు ఆత్మహత్యలతో విషాదంగా మారు తుందన్నారు. రైతు మరణిస్తే వారి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన అధికారులు, రైతు కాదనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలలో రైతులకు అది చేస్తాము, ఇది చేస్తామని చెప్పిన సర్కార్ నేడు తీవ్రంగా విఫలమైం దన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఆత్మహత్య కుటుంబాలకు పరిహారం చెల్లించడంతో ప్రభుత్వం విఫలమైందని, రైతు కుటుంబాలకు న్యాయం జరిగే వర కు పోరాడతామని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ సర్కార్‌కు కార్పొరేట్ల మీద ఉన్న ప్రేమ రైతులపై లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ది హామీలు చేయడమే కాని అమ లు చేసే విధానం లేదన్నారు. మిగులు తెలంగాణను లూటీ చేస్తున్నాడన్నారు. కార్యక్రమానికి ఇరు పార్టీల ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వివేకానంద్, ప్రకాశ్‌గౌడ్, రాజేందర్‌రెడ్డి, గాంధీ, సాయన్న, లక్ష్మణ్, చింతల రాం చంద్రారెడ్డి టిడిపి నాయకురాలు శోభా రాణి, వేంనరేందర్‌రెడ్డి, ఉమా మాదవరెడ్డి, శశికళా యాదవరెడ్డి, బిజేపి నాయకులు రఘునందర్‌రావు తదితరులు హాజరై మాట్లాడారు. అనంతరం ఆశా వర్కర్‌ల ఆందోళనకు నాయకులు వెళ్లి వారు సంఘీభావం ప్రకటించారు.