Home తాజా వార్తలు వచ్చే ఎన్నికల్లో విజయం మాదే : లక్ష్మణ్

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే : లక్ష్మణ్

BJP-LAXMAN

యాదాద్రి భువనగిరి : వచ్చే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు అవలంభించిన పద్ధతులనే నేడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తోందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఎన్నో విలువైన సంక్షేమ పథకాలను అందించినప్పటికీ, వాటిని రాష్ట్రంలో అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. మీడియా సమావేవషంలో బిజెపి నేతలు మనోహర్‌రెడ్డి, దాసరి మల్లేశం, అశోక్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

BJP Victory in next Election : Laxman