Search
Monday 23 July 2018
  • :
  • :

ఎపి అభివృద్ధికి కేంద్రం కట్టుబుడి ఉంది: కన్నా

KANNA

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అన్యాయం చేస్తోందని కొందరు నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా లక్ష్మీ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపి అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, అభివృద్ధే ధ్వేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందని చెప్పారు. లబ్ధి పొందిన తరువాత వెన్నుపోటు పొడవడం సిఎం చంద్రబాబు నాయుడు గుణమని మండిపడ్డారు. ఉక్క ఫ్యాక్టరీ విషయంలో కేంద్రానికి బాబు సమాచారం ఇవ్వలేదని, మైనింగ్ విషయంలో కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదన్నారు. కడప స్టీల్ ప్లాంట్, దుగ్గరాజపట్నం పోర్టు ఇవ్వడానికి బాబుకు ఇష్టం లేదని ఎద్దేవా చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని బాబు రాజకీయంగా వాడుకుంటున్నారని కన్నా దుయ్యబట్టారు.

Comments

comments