Home తాజా వార్తలు ఖాతా తెరిచిన బిజెపి…

ఖాతా తెరిచిన బిజెపి…

BJPఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బిజెపి తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. డయ్యూడామన్ ఎంపి స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి లాలూభాయ్ పటేల్ విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కేతన్ పటేల్ పై ఆయన 9వేల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి బిజెపి విజయం సాధించింది. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఎన్ డిఎ పూర్తి ఆధిక్యంలో ముందుకు సాగుతోంది. మెజార్టీ మార్క్ ను దాటిన ఎన్ డిఎ 330 పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

BJP Winning The Diu Daman MP Seat