Search
Wednesday 26 September 2018
  • :
  • :

‘టైటానిక్‌’ను దాటేసిన ‘బ్లాక్ ప్యాంథర్’

Black Panther Collections Beats Titanic at Domestic Box Office

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ప్యాంథర్’ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అమెరికాలో ఈ సినిమా కలెక్షన్లు కుమ్మేస్తోంది. తాజాగా బ్లాక్ ప్యాంథర్ సినిమా కలెక్షన్లు ఏకంగా ‘టైటానిక్‌’ మూవీ కలెక్షన్లను వెనక్కి నెట్టాయి. ఉత్తర అమెరికాలో ఈ చిత్రం ఇప్పటి వరకు సుమారు 66కోట్ల డాలర్లు కొల్లగొట్టింది. 1997లో విడుదలైన టైటానిక్ 65 కోట్ల డాలర్లు ఆర్జించింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్ మూడో టాప్ గ్రాసర్‌గా ఉంది. దీనికంటే ముందు వరుసలో స్టార్ వార్స్(93కోట్ల డాలర్లు), అవతార్(76 కోట్ల డాలర్లు) ఉన్నాయి. కాగా, బ్లాక్ ప్యాంథర్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 130 కోట్ల డాలర్లు రాబట్టింది.

Comments

comments