Home తాజా వార్తలు జీడిమెట్ల బోనాల పండుగలో అపశృతి

జీడిమెట్ల బోనాల పండుగలో అపశృతి

blade attack on young man in jeedimetla

షాపూర్‌నగర్: జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో బోనాల పండుగలో అపశృతి తలెత్తింది. మద్యం మత్తులో రెచ్చిపొయిన ఇరు వర్గాలు గొడవకు దిగారు. చిన్న గొడవ చిలికి చిలికి గాలి వాణగా మారి చివరకు బ్లేడ్ దాడి వరకు కొనసాగింది. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయలు కావడంతో స్థానికులు మల్లారెడ్డి ఆస్సత్రికి తరలించగా సకాలంలో వైద్యం చేపట్టిన వైద్యులు యువకుడి ప్రాణాపయాం నుంచి కాపాడారు. కుత్బుల్లాపూర్ నియోజికవర్గంలో జరిగిన బోనాల పండుగలో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. షాపూర్‌నగర్‌లోని వివేకానంద నగర్ పోచమ్మ ఆలయం వద్ద ప్రసాద్ అనే వ్యక్తి మద్యం మత్తులో తూగుతుండటంతో రాజరతన్ (21)అనే యువకుడు అతన్ని వారించి పక్కకు వెళ్లాలని గట్టిగా చెప్పాడు. ఈ విషయాం పై  ఇరువర్గాల మద్య గోడవ జరిగింది.

ఇది మనస్సులో పెట్టుకున్న ప్రసాద్ చిన్న కుమారుడు( విద్యార్థి)అరిబింద్ నేత తన తండ్రిని మందలించింది ఎవరూ అంటూ గొడవకు ప్రయత్నించి అతని వెంట తెచ్చుకున్న బ్లేడుతో రతణ్ మెడభాగంలో దాడి చేశాడు. ఈ దాడితో రతన్ అప్రమత్తం అవడంతో బ్లేడ్‌దాడి మెడ మీద తగిలేది కాస్త చెంప భాగంలో తగిలి తీవ్ర గాయం అయ్యింది. తీవ్రరక్త శ్రావం జరుగడంతో ఇరు వర్గాల మద్య గొడవ కాస్త ఉద్రిక్త పరిస్దితులకు దారి తీసింది. వెంటనే స్థానికులు రతన్‌ను సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించగా విధుల్లో ఉన్న వైద్యులు రతన్‌కు మెరుగైన వైద్యం అందించి వెంటనే చికిత్స చేసి ప్రాణ ప్రయాం స్థితి నుంచి కాపాడారు. ఈ మేరకు సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతన్‌ను కలిసి వివరాలు సేకరించారు. భాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని జీడిమెట్ల ఎస్ఐ శ్రీనివాస్ దర్యాప్తు ప్రారంభించారు.
 దాడి ఘటనను గొప్యంగా ఉంచిన జీడిమెట్ల పొలీసులు …..
షాపూర్‌నగర్ లో బ్లేడ్‌దాడి ఘటనపై జీడిమెట్ల పొలీసులను వివరాలు అడుగగా చిన్న గొడవ అంటూ కొట్టి పారేశారు. ఇరు వర్గాల మద్య గొడవ జరిగింది. బాధితుడికి చెంపకు గాయం అయ్యింది. వెంటనే వైద్యం చేసి పంపించారు అంటూ సెలవు ఇచ్చిన ఓ పోలీసు అధికారి. భాదితుడికి గుట్టుచప్పూడు కాకుండా సూరారంలోని మల్లారెడ్డి ఎస్‌ఐ ఐసియూలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు.