Home అంతర్జాతీయ వార్తలు అంత్యక్రియలలో పేలుళ్లు

అంత్యక్రియలలో పేలుళ్లు

  • కాబూల్ ఖనన వాటికలో 15 మంది దుర్మరణం

Afgah-Blast

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లో విషాదం సందర్భంగా ఘోరం జరిగింది. స్థానికంగా శివార్లలో అంత్యక్రియల సందర్భం గా శనివారం జరిగిన వరుస పేలుళ్లలో కనీసం 15 మంది మృతి చెందారు. శుక్రవారం సైన్యం జరిపిన కాల్పులలో మృతి చెందిన రాజకీయ నాయకుడి కుమారుడు సలీమ్ ఇజాద్యార్ అంతిమయాత్ర సందర్భంగా పేలుళ్లు జరగడం తో మరింత ఉద్రిక్తత నెలకొంది. దేశంలో ఉగ్రవాద దాడు లకు నిరసనగా శుక్రవారం ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు జరగడంతో, వారిని కట్టడి చేసేందుకు సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో సెనేటర్ ఇజాద్యార్ కుమారుడు కూడా చనిపొయ్యారు. పర్వత ప్రాంతమైన ఖేర్‌ఖానా ఖనన వాటికలో అంత్యక్రియలు జరుగుతుండగా పేలుళ్లు జరిగా యి. పలువురు అధికారిక ప్రముఖులు కూడా అంత్యక్రియ లకు హాజరయిన దశలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారీ స్థాయిలో జరిగిన పేలుళ్లతో ఈ ప్రాంతంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి పోయినట్లు, ఈ ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. శరీరాలు ముక్కలు ముక్కలు అయినట్లుగా గుర్తించారు. పేలుళ్లు ఏ విధంగా జరిగాయనేది వెల్లడి కాలేదని , దర్యా ప్తు సాగుతోందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ డానిష్ తెలిపారు. అంత్యక్రియలకు ప్రభు త్వ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అబ్దుల్లా అబ్దుల్లా హాజ రయినట్లు, ఘటనలలో ఆయనకు ప్రమాదం ఏదీ జరగన ట్లు వార్తా సంస్థలు తెలిపాయి.
దిగజారిన కాబూల్ పరిస్థితి
ఓ వైపు ఉగ్రవాదుల దాడులు, ప్రజల దుర్మరణాలు, వాటిని నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు జరగడం, ఈ సందర్భంగా హింసాకాండ చోటుచేసుకోవడం వంటి ఘటనలతో కాబూ ల్ ఉద్రికతంగా మారింది. ఎటుచూసినా ఆందోళనకర పరి స్థితులు నెలకొన్నాయి. ఈ దశలోనే చివరికి అంత్య క్రియ లలో కూడా రక్తపాతం జరగడంతో పరిస్థితి మరింత దిగ జారింది. గత బుధవారమే కాబూల్ దౌత్యకార్యాల యాల వద్ద ట్రక్కు బాంబింగ్ ఘటనలో వంద మంది వరకూ చనిపొయ్యారు. ఎందరో గాయపడ్డారు. చాలా కాలం తరు వాత ఇది అత్యంత దారుణమైన ఘటనగా మారింది. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అయ్యాయి. తరు వాత జరిగిన కాల్పులలో సలీమ్ మృతి చెందడం, ఆయన అంత్యక్రియలలో కూడా హింసాకాండ చోటుచేసు కోవ డంతో ప్రజలలో అభద్రతా భావం నెలకొంది. ఎక్కడ ప్రద ర్శనలు జరిగినా, ఎలాంటి జనసమూహాలు ఉన్నా దాడు లకు శత్రువులు వ్యూహాలు పన్నినట్లు తమకు ఇంట లిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని కాబూల్ సైనికా ధికారి ఒకరు తెలిపారు. ఈ దశలో ప్రజలు నిరసన ప్రదర్శ నలకు దిగకుండా ఉండటం మంచిదని సూచించా రు. అంత్యక్రియల సందర్భంగా ఉగ్రవాదుల నుంచి దాడు లకు వీలుందనే సమాచారం అందడంతో అధికారు లు పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. పలు చోట్ల రహ దారులను దిగ్బంధించారు. అయినా పేలుళ్లను నివా రించ లేకపొయ్యారు. అధ్యక్షులు ఘనీ రాజీనామా చేయాల ని, అధికార యంత్రాంగం ప్రజల నిరసనలు విచ్ఛిన్నం చేస్తోం ది కానీ దాడులను అరికట్ట లేకపోతోందని, దీనిని బట్టి ఉగ్రవాద సంస్థలతో ప్రభుత్వం కుమ్మక్కు అయి నిరసనల గొంతు నులిమేందుకు యత్నిస్తున్నట్లు స్పష్టం అవుతోందని నిరసనకారుల తరఫు ప్రతినిధి అసిఫ్ అష్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.