Home రంగారెడ్డి పంటకు ప్రాణం

పంటకు ప్రాణం

Blessing is the rain that lasts for two days

అన్నదాతల్లో ఆనందం
రెండు రోజులుగా కురుస్తున్న వర్షం

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా : వరుణుడు కరుణించాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో అన్నదాత ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన నుంచి ఇప్పటివరకు పెద్దగా వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్‌పై ఆశలు సన్నగిల్లుతున్న తరుణంలో ఎడతేరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నేలతల్లి పులకరిస్తుంది. చినుకులు చినుకులుగా వర్షం కురుస్తూ అప్పుడప్పుడు వేగం పెరుగుతూ బుధవారం సాయంత్రం నుంచి గురువారం రోజంతా వర్షం పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు ప్రాణం వచ్చిందని నారుమళ్లు వేయడం మరింత జోరుగా సాగుతుందని రైతులు ఆనందంగా ఉన్నారు. వరితో పాటు ఇతర పంటలను విస్తారంగా సాగు చేయడానికి అన్నదాతలు సిద్దమవుతున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఇబ్రహింపట్నం మండలంలో అత్యధికంగా వర్షం నమోదు కాగా చేవెళ్ళ, మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొందూర్గు, చౌదరిగూడం, ఫరూక్‌నగర్, కేశంపేట్, శేరిలింగంపల్లి, బాలాపూర్, హయత్‌నగర్, అమన్‌గల్, మాడ్గుల మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. కొత్తూరు, నందిగామ, మహేశ్వరం, కందుకూర్, తలకొండపల్లి, కడ్తాల్, యాచారం, రాజేంద్రనగర్, గండిపేట్, శంకర్‌పల్లి మండలాల్లో సాదారణ వర్షం నమోదైంది. వికారాబాద్ జిల్లా పరిధిలో తాండూర్, పెద్దెముల్, దౌల్తాబాద్‌లో బారీ వర్షం నమోదు కాగా మిగతా మండలాల్లో మోస్తారు వర్షం పడింది. మేడ్చల్ జిల్లా పరిధిలో సైతం విస్తారంగా వర్షాలు కురిశాయి.

అప్రమతత్త అవసరం
రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పాత ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు పెర్కొన్నారు. గురువారం నాడు చెవెళ్ల మండలం దామరగిద్ద, మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం తదితర గ్రామాల్లో మట్టి ఇళ్ల గోడలు కూలీపోయాయి. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగిన ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. పాత భవనాలలో నివసిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు పాటించవలసిన అవసరం చాలా వరకు ఉంది. వర్షాలతో సీజనల్ వ్యాదులు వచ్చే అవకాశం ఉందని తగు జాగ్రత్తలు పాటింటి వ్యాదుల భారీన పడకుండా ఉండాలి.