Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

‘బిఎల్‌ఎఫ్ పోరు’లో మేము సైతం

BLF is preparing for Dharna before collectorates on 27th

కదులుతున్న కార్మిక దండు
27న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు బిఎల్‌ఎఫ్ సన్నద్ధం
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎప్) పిలుపులో భాగస్వాములవ్వాలని విజ్ఞప్తి
నగరంలో విస్తృత ప్రచారం

మన తెలంగాణ/ మరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్‌ఎఫ్) ఆధ్వర్యంలో పోరుకు సిద్దమంటూ కా ర్మికవర్గం కదులుతోంది. బహుజన వాదం తో ఏర్పడిన బిఎల్‌ఎఫ్ గత కొంత కాలంగా నగరంలో విస్తృతంగా పర్యటనలు, సర్వేలు చేస్తున్న విషయం విధితమే. అన్ని వర్గాలను, రంగాలను కలుపుకొని ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో వివిధ రంగాల కార్మికులను కదిలిస్తూ పోరుకు సిద్దం చేస్తోంది. ఇప్పటికే నగరంలో నెలకొన్న సమస్యలపై సర్వేలు నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేయాలని అందుకనుగుణమైన ప్రణాళికలు సైతం చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిని నరేందర్ నేతృత్వంలో పలు మండలాలతో పాటు వివిధ ఏరియాలలో సమావేశాలు నిర్వహించారు. బహుజన వాదాన్ని అర్థం చేయించడానికి ప్రయత్నిస్తునే, వివిధ రంగాలలో పని చేస్తున్న వారందరినీ 27న తలపెట్టిన ఆందోళనలో భాగస్వాములను చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలో బృందాలుగా ఏర్పడి సర్వేలు, పర్యటనలు చేశారు.

కలిసివచ్చే యూనియన్లను సైతం కదిలిస్తున్నారు. నగరంలో వరంగల్ ఏరియాలో బిఎల్‌ఎఫ్ నాయకుడు మాలోతు సాగర్ నేతృత్వంలో మున్సిపల్ కార్మికులు, లారీ ట్రాన్స్‌పోర్టు కార్మికులు, నిర్వసితులైన కుటుంబాలు, అడ్డాకూలీలతో సమావేశాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఆందోళనలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. హన్మకొండలోని ఆటో కార్మికులతో బిఎల్‌ఎఫ్ నాయకుడు మంద సంపత్ సమావేశం నిర్వహించారు. పబ్లిక్‌గార్డెన్ ప్రాంతంలోని ఆటో, నిర్మాణ కార్మికులతో సిఐటియు నేత టి. ఉప్పలయ్య కరపత్ర ప్రచారం చేసి ఆందోళనలకు సిద్దం చేస్తున్నారు. వేల్పుల సారంగపాణి నేతృత్వంలోని బృందం పెట్రోల్ బంక్‌లలో పని చేస్తున్న కార్మికులను, షాపు గుమస్తాలను, కార్మికులను, టైలర్ వర్కర్లను, బార్ అండ్ రెస్టారెంట్లలో పని చేసే వర్కర్లను బిఎల్‌ఎఫ్ ఇచ్చిన పిలుపులో భాగస్వాములను చేయడానికి వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్కర్లకు కనీస వేతనాలు, పని గంటలు, చట్టబద్దమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పని భద్రత కోసం ఐక్యంగా ఆందోళనలు చేయాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీటన్నింటిలో అంతర్లీనంగా బహుజన వర్గాలను, కులాలు కలుపుకొని సామాజిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బిఎల్‌ఎఫ్ ప్రయత్నిస్తోంది. బిఎల్‌ఎఫ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ సాయిని నరేందర్ నేతృత్వంలో బిఎల్‌ఎఫ్ బహుజనుల చెంతకు తమ శక్తిమేరకు వెళ్తూ కదిలిస్తోందనేది గమనార్హం.
27న జరిగే ఆందోళనను జయప్రదం చేయండి… సాయిని నరేందర్, బిఎల్‌ఎఫ్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్
మహుజనులంతా ఐక్యంగా ఈ నెల 27వ తేదిన జిల్లా కలెక్టరేట్ల ఎదుట తలపెట్టిన ఆందోళనలో భాగస్వాములు కావాలి. బహుజన కులాలు ఐక్యం కావాల్సిన అవసరాన్ని బిఎల్‌ఎఫ్‌గుర్తించి పని చేస్తోందని బహుజలంతా గమనించాలి. వివిధ రంగాలలో పని చేస్తున్న వారందరూ బిఎల్‌ఎఫ్ పిలుపులో భాగస్వాములవ్వాలని కోరుతున్నాం.

Comments

comments