Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మానవత్వం చాటుకున్న కుషాయిగూడ ఎసై

SI-help-to-Poor-People

మన తెలంగాణ/చర్లపల్లి: పోలీసులు అనగానే ప్రజలకు భయం… వారు నిత్యం కేసులు నేరాలతో ఎప్పుడు పని ఒత్తిడిలో ఉంటారు. ఒత్తిడిని తట్టుకుని విధులు నిర్వహిస్తు  ఓ వ్యక్తి ఆపదలో ఉన్న విషయం తెలుసుకుని రక్తదానం చేసిన ఎసైని సహచరులతో పాటు స్టేషన్ సిఐ అభినందించారు. వివరాలోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ముత్యాలమ్మ గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. ఇటీవల ఆమెను కుషాయిగూడలోని తులసి ఆసుపత్రిలో చేర్పించారు. బుధవారం ముత్యాలమ్మకు గుండె అపరేషన్ నిమిత్తం అత్యవసరంగా ఒ నెగిటివ్ రక్తం అవసరం పడింది. అసుపత్రిలో రక్తం లేదు మత్యాలమ్మ కుటుంబీకులు ఒనెగిటివ్ రక్తం కోసం వెతుకుతుండగా విషయం తెలుసుకున్న కుషాయిగూడ ఎసై చంద్రశేఖర్ పది నిమిషాలు విధులను పక్కన పెట్టి ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. చేసిన పని తెలుసుకుని కుషాయిగూడ  సిఐ చంద్రశేఖర్ ఎసైని అభినందించాడు.

Comments

comments