Home తాజా వార్తలు డ్రైవింగ్ లైసెన్స్‌లపై కనిపించని బ్లడ్ గ్రూప్

డ్రైవింగ్ లైసెన్స్‌లపై కనిపించని బ్లడ్ గ్రూప్

Driving Licence

 

హైదరాబాద్: ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఓ క్షతగ్రాతుడు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఆయన్ని చుట్టుపక్కల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు రక్తం ఎక్కించాలని సూచించారు. మరి క్షతగ్రాతుడి గ్రూప్ ఎమిటనేది పరీక్ష చేసేందుకు కొంత సమయం పడుతుంది. అంత వ్యవధి కూడా లేదు. దీంతో కొందరు డ్రైవింగ్ లైసెన్స్ చూడంటూ సలహా ఇవ్వడంతో జేబుల్లోంచి లైసెన్స్ తీశారు. అంతే … అందులో బ్లడ్ గ్రూప్ కాలమ్ ఖాళీగా ఉంది….

రవాణాశాఖ జారీ చేసే డ్రౌవింగ్ లైసెన్స్‌లో ఈ డొల్లతనం కనిపిస్తోంది. ప్రాణాపాయ స్థితిలో అపర సంజీవిలో పని చేసే ఒక అంశాన్ని అటు రవాణాశాఖ అధికారులు, ఇటు వాహనదారులు మూకుమ్మడిగా నిర్లక్షం చేస్తున్నారు. ఎంతో మంచి ఉద్ధేశ్యంతో రూపొందించిన విధానాన్ని అభాసుపాలు చేస్తున్నారు. సహాజంగా ఒక వాహన దారుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే ముందు శిక్షణ డ్రైవింగ్ లైసెన్స్(ఎల్‌ఆర్) తీసుకోవాలి, ఇందుకు ఫారం 2 ను పూరించిన తర్వాత పరీక్షకు హజరు కావాలి. ఈ నేపథ్యంలో ఆ ఫారంలోని సదరు అభ్యర్థి బ్లడ్ గ్రూప్ అనే అంశం నమోదు చేయాల్సి వుంటుంది. అనంతరం ఆరు నెలలు లోపు తీసుకునే డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఫారం 4 కేడా పూరించాలి.ఇందులో అభ్యర్థి బ్లడ్ గ్రూప్‌ఖ అంశం నమోదు చేయాలి. సాధారణ అభ్యర్థులైతే ఎందుకు వచ్చిన తంటా అని ఖచ్చితంగా ఈ వివరాలు నమోదు చేస్తారు. ఇక దళారులైతే అతా తమ చేతుల్లో పనే కదాని విస్మరిస్తారు. ఈ రెండు ప్రక్రియల్లోనూ అభ్యర్థి గ్రూప్‌ను కార్యాలయాల్లో నమోదు చేసుకోవడానికి తీసుకోలేదు.

మోటారు వాహనాల చట్టం రూపొందించిన సమయంలోనే ఎంతో ముందు చూపుతో ఈ అంశాన్ని పొందు పర్చారు. వాహనదారులు ఎదైనా ప్రమాదానికి గురియితే వెంటనే అతడి రక్త గ్రూప్‌ను వైద్యులకు గాని, ఇతరులకు తెలుసుకునే సౌకర్యం కల్పించారు. ఈ మేరకు డ్రైవింగ్ లైసెన్స్‌వెనుక భాగంలో స్పష్టంగా బ్లడ్ గ్రూప్ అనే కాలమ్ వుంచారు. ఇక్కడే కాదు విదేశాల్లో అయితే వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ)లో ఇందుకు సంబంధించిన కాలమ్ తప్పని సరిగా వుంటుంది. అధికారులకు ఇది చిన్న అంశమే కావచ్చు ఆపద సమయాల్లో అదే కీలకంగా మారుతుంది. అయినప్పటికి రవాణాశాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో బ్లడ్ గ్రూప్ కాలమ్ ఖాళీగా ఉండటం వారి బాధ్యతరాహిత్యానికి నిదర్శనం.

వాహన దారులు తమ దరఖాస్తులలో ఇందుకు సంబంధించి వివరాలు పూరించినప్పటికి పర్మినెంట్‌గా అధికారులు జారీ చేసే డ్రైవింగ్ లైసెన్స్‌ల్లో ఎందుకు ముద్రించడంలేదో ఎవరికి అంతుపట్టడం లేదు. అధికారుల్లో ఈ విషయంపట్ల స్పష్టత లేదనే విమర్శలు వస్తున్నాయి. మూడు సంవత్సరాల క్రితమే గవర్నర్ ఇఎస్ఎల్‌ నర్సింహన్ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌పై బ్లడ్ గ్రూప్ నమోదు అయ్యే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. అయితే అధికారులు ఇంత వరకు గవర్నర్ సూచన కూడా పట్టించుకోక పోవడం వారి నిర్లక్షనానికి నిదర్శనమని వాహన దారులు విమర్శిస్తున్నారు.

Blood group that does not appear on driving licence