Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

యెమెన్‌లో పడవ ప్రమాదం

Boat Accident in Yemen : 160 People Dead

యెమెన్ : యెమెన్‌లో శుక్రవారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 160 మంది గల్లంతయ్యారు. ఆఫ్రికా నుంచి వీరు వలస వస్తుండగా పడవ మునిగిపోయిందని యెమెన్ రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. 100 మంది సోమాలియా, 60 మంది ఇథియోపియా వాసులతో ఓ పడవ సోమాలియాలోని బొసాసో పోర్టు నుంచి బయల్దేరింది. గల్లంతైన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. పడవలో పరిమితికి మించి ప్రయాణికులు ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. యెమెన్‌లో నెలకొన్న అంతర్గత సంక్షోభం కారణంగా ఆఫ్రికా దేశాల నుంచి వలసలు పెరిగిన విషయం తెలిసిందే.

Boat Accident in Yemen : 160 People Dead

Comments

comments