Search
Friday 21 September 2018
  • :
  • :

రష్యాలో ఘోర పడవ ప్రమాదం..!

Boat collision on Russia's Volga River killed 11 People

మాస్కో: ఈ నెలలో ప్రారంభం కాబోతున్న సాకర్ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న రష్యాలో మంగళవారం విషాద సంఘటన చోటుచేసుకుంది. రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. దీంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.  సమాచారమందుకున్న అత్యవసర విభాగం సిబ్బంది ఓల్గా నది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. దీంతో ఐదుగురిని సురక్షితంగా కాపాడారు. వెంటనే బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Comments

comments