Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

సన్నగా ఉన్నారా?

life2
పాలు శరీర బరువును పెంచే ఆహార పదార్థాలలో ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల కెలోరీలను పొందవచ్చు.ఆవాల నూనె, కొబ్బరి నూనెలతో తయారు చేసిన ఆహారాన్ని తినాలి . ప్రతి రోజు జ్యూస్‌లను తాగాలి. శరీర బరువు పెరగాలంటే అధికంగా ఆహార పదార్థాలను తీసుకోవాలి కానీ, ఎంచుకునే ఆహార పదార్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎలాంటి కెలోరీలను అందించని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. పోషక విలువలు అధికంగా ఉండి, క్యాలరీలను కలిగి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. రోజు తీసుకునే దాని కన్నా 500 నుండి 1000 కేలరీలు గల ఆహార పదార్థాలను అదనంగా తీసుకోవటం వల్ల ఆరోగ్యకర బరువు పెరుగుతుంది. మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఆరోగ్యకర కొవ్వు, నాణ్యత గల ప్రోటీన్‌లను కలిగి ఉండాలి.
* పాల ఉత్పతులు: బరువు పెరగటానికి అందుబాటులో ఉన్న ఆరోగ్యకర ఆహార పదార్థాలు పాలు. పాల నుండి ప్రోటీన్, కాల్షియంలను పొందవచ్చు. చీస్, పెరుగు వంటి పాల ఉత్పత్తులు ఆరోగ్యకర శరీర బరువును పెంచుతాయి.
* నట్స్: ఒక పిడికెడు నట్స్ నుండి కొన్ని వందల ఆరోగ్యకరమైన క్యాలరీలను పొందుతారు. ప్రోటీన్, విటమిన్ ఇ, ఫైబర్‌లను అధిక మొత్తంలో కలిగి వుంటాయి. వీటిని సలాడ్‌లతో, భోజనంలో లేదా స్నాక్స్‌గా కూడా తినవచ్చు. పీ నట్ బటర్ కూడా అధిక మొత్తంలో కేలోరీలను కలిగి ఉంటుంది. సలాడ్, సాండ్విచ్, టోస్ట్ వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది.
* డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్ లను నట్స్ తో కలిపి తీసుకోవటం వల్ల బ్రేక్‌ఫాస్ట్‌లో మంచి పోషకాలను పొందినవారవుతారు. సగం కప్పు నట్స్ 200 కేలోరీలతో పాటూ విటమిన్, మినరల్, ఫైబర్ లను కలిగి ఉంటాయి. వీటిని సాయంత్రపు సమయంలో స్నాక్స్ గా తీసుకోవచ్చు.
* ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు: ఆలివ్ ఆయిల్, సోయా నూనె, ఆవాల నూనె, కొబ్బరి నూనె లలో కొవ్వు పదార్థాలను కలిగి ఉండే ఆహార పదార్థాలకు ఉదాహరణగా పేర్కొనవచ్చు.ఇవి గుండెకు ఆరోగ్యకరం, ఒక చెంచా నూనెలో 45 కేలోరీలను కలిగి ఉంటాయి. హోల్ వీట్ బ్రెడ్‌లను వీటిలో ముంచుకొని తినవచ్చు లేదా సలాడ్‌లలో కలుపుకొని తినటం వల్ల అదనపు క్యాలోరీలను పొందినవారవుతారు.
* పండ్ల రసాలు: ఆహారం తీసుకోవటం కన్నా ద్రావణాల ద్వారా అదనపు క్యాలరీల ద్వారా అదనపు కొవ్వు పదార్థాలను పొందవచ్చు. తాజా స్వచ్ఛమైన పండ్ల రసాలను తాగటం వల్ల ఆరోగ్యకర బరువు పెరుగుతారు. ఒక గ్లాసు పండ్ల రసం 100 కంటే అధిక క్యాలరీలను కలిగి ఉంటుంది. వీటి నుండి శరీరానికి మంచి విటమిన్‌లు అందటమే కాకుండా, అధిక మొత్తంలో క్యాలరీలు కూడా అందుతాయి.

Comments

comments