Search
Tuesday 17 July 2018
  • :
  • :

బొగతలో సందర్శకుల సందడి

Bogatha Waterfalls Water Fall in Jayashankar Jilla

వాజేడు : మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నా బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి మొదలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలో గల బొగత జలపాతం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ఆదివారం సెలవు దినం కావడంతో పలు ప్రాంతల నుండి వచ్చిన పర్యాటకులతో జలపాతం వద్ద సందడి నెకలకొంది. పెద్ద,చిన్న తేడా లేకుండా జలపాతంలో ఈత కొడుతూ,సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. ప్రకృతి ఒడిలో నుండి జాలువారుతున్న జలపాతం అందాలు తిలకిస్తూ,పచ్చటి ప్రకృతిని పర్యాటకులు అస్వాదించారు. కుటుంబ సమేతంగా జలపాతనికి తరలివచ్చిన పర్యాటకులు అక్కడే వంటలు చేసుకుని భోజనాలు చేశారు.

Comments

comments