Home దునియా మరుగుతున్న నది (వీడియో)

మరుగుతున్న నది (వీడియో)

Boiling Water

 

నదిలో నీళ్లు చల్లగా ఉంటాయి. కానీ దీనికి భిన్నంగా … ఆ నదిలోని నీళ్లు మసులుతున్నట్లుగా పొగలు కక్కుతూ ఉంటాయి. ఈ నదిని చూడాలంటే ‘పెరూ’ వెళ్లాల్సిందే! ఆ నదిలో మాత్రం వేడిగా ఉంటాయి. వేడిగా అంటే గోరు వెచ్చగా కాదు. చేయి పెడితే బొబ్బలెక్కడం ఖాయం. అంత వేడిగా ఉంటాయి. పెరూ దేశంలో మయంటాయకు అటవీ ప్రాంతంలో కనిపిస్తుందీ నది. ఈ నదిలో నీళ్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అందుకే ఈ నదికి ‘బాయిలింగ్ రివర్’ అని పేరుంది. నదిలో నీళ్లు ఎందుకు వేడిగా ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. పారుతున్న నదిలో నీళ్లు ఎందుకు అంత వేడిగా ఉంటున్నాయో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. నదిలోని నీళ్లు వేడిగా ఉన్నాయంటే దాని దగ్గరలో లేదా ఆ నది లోపల అగ్నిపర్వతం ఉండి ఉండాలి. కానీ ఈ నదికి దగ్గరలో అగ్నిపర్వతాలు అసలు లేవు. మరెందుకు నీళ్లు వేడిగా ఉంటున్నాయి. పరిశోధనల అనంతరం సూర్యుని వేడివల్లే నీళ్లు వేడెక్కుతున్నాయని భావించారు. వేసవిలో భూమిలో పగుళ్లు ఏర్పడుతాయి. వర్షాకాలంలో వానలు కురిసిన సమయంలో ఆ పగుళ్లలోకి నీళ్లు చేరుతాయి. భూమి పొరల్లోని ఉష్ణోగ్రత కారణంగా అలా లోపలకి వెళ్లిన నీళ్లు వేడెక్కుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. ఈ నదిలో కప్పలు, పాములు, ఇతర జంతువులు పడితే వెంటనే చనిపోతాయి. అయితే కొన్నిసార్లు జంతువులు ఆ నదిలో ఉండటం కనిపిస్తుంది. దానికి కారణం వర్షాలు చాలా రోజులు కురిసిన సమయంలో నదిలో నీళ్లు చల్లబడతాయి. ఆ సమయంలో నీళ్లు వేడిగా ఉండవు కాబట్టి జంతువులు నదిలోకిదిగుతుంటాయి.

 

Credit by