Search
Wednesday 21 November 2018
  • :
  • :

బాలీవుడ్‌ నటి గీతాకపూర్‌ కన్నుమూత

geetha-kapur

బాలీవుడ్: అలనాటి బాలీవుడ్ యాక్టర్ గీతా కపూర్ శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ముంబయిలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారని సిబిఎఫ్ సి సభ్యడు, నిర్మాత అశోక్ పండిత్ వెల్లడించారు. గత ఏడాది నుంచి వృద్దాశ్రమంలో ఉంటున్న ఆమె తన పిల్లల కోసం ఎదురుచూస్తూ చివరకు వాళ్లను చూడకుండానే తనువు చాలించారని చెప్పారు. గీతా కపూర్ మృతదేహన్ని ముంబయిలోని విలే పర్లీలోని కూపర్ హాస్పిటల్ లో రెండు రోజులు ఉంచుతామన్నారు. తన పిల్లలు తల్లిని చివరి సారి చూసుకొని అంత్యక్రియలు నిర్వహించాలని ఆయన కోరారు. గీతాకపూర్ పిల్లలు రాకపోతే తామే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతేడాది మే నెలలో అనారోగ్యంతో బాధపడుతోన్న గీతా కపూర్‌ను ఆమె కొడుకు రాజా ముంబయిలోని ఓ దవాఖానకి తీసుకొచ్చి, తాను ఎటిఎం దగ్గరకి వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి, ఆమెను అక్కడే విడిచి వెళ్లిపోయాడు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సిబిఎఫ్‌సి సభ్యుడు అశోక్‌ పండిత్‌ ఆమెకు వైద్యశాలలో చికిత్స చేయించి, వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. తన కొడుకు తనను కొట్టేవాడని, నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడని ఆ సందర్భంగా గీతా కపూర్‌ మీడియాకు చెప్పుకుని కన్నీరు మున్నీరయ్యారు. అలనాటి సూపర్ హిట్ హిందీ చిత్రం ‘పాకీజా’ గీతా కపూర్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది.

Comments

comments