Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

రాజకీయాల్లోకి రానున్న ప్రముఖ నటుడు

retesh

ముంబయి: బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకున్ననటుడు రితేశ్‌దేశ్‌ముఖ్. ప్రస్తుతం అక్షయ్‌కుమార్ తో హౌజ్‌ఫుల్ 4 సినిమాలో రితేశ్ నటిస్తున్నాడు. ఈ నటుడు మహారాష్ట్ర మాజీ సిఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కొడుకనే సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాలకు సంబధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అదే రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. రితేశ్ రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Comments

comments