Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మెగాస్టార్ మూవీలో సల్మాన్‌ఖాన్?

Chiranjeevi-Salman-khan

‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా విషయంలో అధికారిక ప్రకటన ఏదీ లేదేమిటని అనుకుంటుండగా… తాజాగా  మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా గురించి ఓపెన్‌గా చెప్పేశాడు. ఈ సినిమాను  తను ఎందుకు చేస్తు న్నాననే విషయం మొదలుకొని పనిచేసే టెక్నీషియన్ల వివరాలను కూడా తెలియజేశాడు. స్క్రిప్ట్ వర్క్ కోసం ఎంతమంది రచయితలు పనిచేస్తున్న విషయాన్ని కూడా వివరించాడు.  ఈ సందర్భంగా తను చేసే ఈ 151వ మూవీలో ఆలిండియా ఆర్టిస్టులు నటిస్తారని చెప్పాడు చిరు. ‘ఉయ్యాలవాడ…’ను తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ తెరకెక్కించబోతున్న నేపథ్యంలో ఆయా ఇండస్ట్రీలకు చెందిన నేషనల్ అప్పీల్ ఉన్న ఆర్టిస్టులతో నటింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్లుగా ఖచ్చితంగా బాలీవుడ్ భామల్నే తీసుకుంటారని అంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లే కాదు… బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సైతం ఈ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలిసింది. సల్మాన్‌తో ఓ గెస్ట్ రోల్ చేయిస్తే హిందీ వర్షన్‌కు బాలీవుడ్‌లో మంచి ప్రచారం దక్కుతుందని… హిందీ ప్రేక్షకులకు ఈ సినిమా చేరువవడం సులువవుతుందని నిర్మాత రామ్‌చరణ్ భావిస్తున్నాడట. సల్మాన్‌తో తనకు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో చరణ్ ఉన్నాడట. చిన్న క్యామియో రోల్ కావడంతో సల్మాన్ ఒప్పుకునే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. నిజంగా సల్మాన్ నటిస్తే ‘ఉయ్యావాడ..’కు అది ఖచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. మరి తమిళం నుంచి ఏ ఆర్టిస్టుల్ని తీసుకుంటారో చూడాలి. ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈలోపే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

Comments

comments