Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్ నటి బిపాసా బసుకు అస్వస్థత

Bollywood Actress Bipasha Basu is Sick

ముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటి బిపాసా బసు అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా ఆమె శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ముంబయిలోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. కొన్ని రోజుల పాటు ఆమె ఆస్పత్రిలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. ముంబయికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆమెకు చికిత్స చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఆమె కుటుంబ సభ్యులు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చివరిగా ఆమె ఎలోన్ సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఆమెకు జోడీగా కరణ్‌సింగ్ గ్రోవర్ నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరు జోడీగా మరో సినిమా రాబోతోంది.

Bollywood Actress Bipasha Basu is Sick

Comments

comments