Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాలీవుడ్ హీరోయిన్

kanganaన్యూయార్క్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అమెరికాలో సంభవించిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హన్సాల్ మెహత దర్శకత్వంలో కంగనా నటిస్తున్న ‘సిమ్రాన్’ మూవీ షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్ మూగించుకొని తిరిగి తాను బసచేసిన జార్జీయాలోని హోటల్‌కు వస్తున్నప్పుడు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కంగనా మోచేతితోపాటు నుదిటిపై స్వల్ప గాయాలైన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనంలో కంగనాతోపాటు హీరోలు వరుణ్ ధావన్, హర్షవర్దన్ కపూర్, మరో హీరోయిన్ దిశా పటానీలు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాతి రోజు నుంచే కంగనా మళ్లీ షూటింగ్‌లో పాల్గొందని మూవీ యూనిట్ తెలిపింది.