Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాలీవుడ్ నటి మృతి

pass-awayబాలీవుడ్ సీనియర్ నటి రీటా బాధురి (62) మంగళవారం ఉదయం  కన్నుమూశారు. పలు హిందీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆమె గత కొంతకాలంగా మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. కమల్‌హాసన్‌తో కన్యాకుమారి (1971) సినిమాలో, షారుఖ్‌ఖాన్, సతీష్ షా, రవి బాస్వానీలతో కలిసి కభీ హా కభీ నా (1994) చిత్రంలో ఆమె నటించారు. బాదురి మృతిపట్ల పలువురు బాలీవుడ్ నటులు తమ సంతాపాన్ని తెలియజేశారు. అయితే బాలీవుడ్ నటుడు శిశిర్ కుమార్ తన ఫేస్‌బుక్ పేజీ ద్వారా ఆమె మరణవార్తను తెలియజేశారు. “రీటా బాదురి మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఒక మంచి వ్యక్తిత్వమున్న మనిషిని కోల్పోయాం. నిన్ను మిస్ అవుతున్నాం అమ్మా” అని శిశిర్ కుమార్ పేర్కొన్నారు. ఇక రీటా  బాదురి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం ముంబయి అంథేరి ఈస్ట్‌లోని పార్సీవాడలో జరిగాయి.

Comments

comments