Home జాతీయ వార్తలు బాలీవుడ్ నటి కన్నుమూత

బాలీవుడ్ నటి కన్నుమూత

Bollywood Actress Rita Bhaduri Passes Away

ముంబయి : బాలీవుడ్ సీనియర్ నటి రీటా భాదురి (82) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని రాజీ ఫేమ్, నటుడు శిశిర్ శర్మ తన ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలతో ఆమె ప్రసిద్ధి గాంచారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఆమె టివి సిరియళ్లలో కూడా నటించారు. మంగళవారం సాయంత్రం అంధేరీలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రీటా భాదురి మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Bollywood Actress Rita Bhaduri Passes Away