Home తాజా వార్తలు బాలీవుడ్ నటి షమ్మి కన్నుమూత

బాలీవుడ్ నటి షమ్మి కన్నుమూత

SHAMMI

ముంబయి : పాత తరం బాలీవుడ్ నటి షమ్మి (89) మంగళవారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం చనిపోయారు. షమ్మి మృతి విషయాన్ని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సందీప్ ఖోస్లా ట్విటర్ ద్వారా తెలిపారు. ఆయన ఆమెకు నివాళులు అర్పించారు. బాలీవుడ్‌లో షమ్మిని షమ్మి ఆంటీ అని పిలిచేవారు. ౧౮ ఏళ్ల ప్రాయంలోనే ఆమె సినిమారంగంలో అడుగు పెట్టారు. ‘ ఉస్తాద్ పెడ్రో ’ సినిమాతో ఆమె పరిచయమయ్యారు. ‘ మల్హర్’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా ఎదిగారు. అనంతరం ఆమె ‘ కూలీ నెం.౧, ఖుదా గవా, హమ్, ఆర్ట్, ది బర్నింగ్ ట్రెయిన్ తదితర చిత్రాల్లో నటించారు. పలు టివి సీరియళ్లలో కూడ ఆమె నటించారు. షమ్మి బాలీవుడ్ దర్శక – నిర్మాత సుల్తాన్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఏడేళ్ల తరువాత వారు విడిపోయారు. షమ్మి మృతిపై పలువురు బాలీవుడ్ నటీనటులు సంతాపం తెలిపారు. బుధవారం ఆమె అంత్యక్రియలు ముంబయిలో జరగనున్నాయి.

Bollywood actress Shammi passes away