Search
Saturday 17 November 2018
  • :
  • :

మల్లికా శెరావత్ సంచలన వ్యాఖ్యలు..!

Bollywood Beauty Mallika sherawat Sensational Comments

ముంబయి: బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచార ఘటనలు, క్యాస్టింగ్ కౌచ్ వివాదాలను ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘దాస్ దేవ్’ స్పెషల్ స్క్రీనింగ్ గురువారం ముంబయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికా మీడియాతో మాట్లాడుతూ… ఇండియాలో చిన్నారులు, మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు సిగ్గుచేటని పేర్కొన్నారు. గాంధీ తిరిగిన ఈ దేశం ఇప్పుడు అత్యాచారాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. ఈ సమయంలో దేశ ప్రజలు మీడియాపైనే ఆశలు పెట్టుకున్నారని, ఈ విషయంలో మీడియానే ఏదో ఒకటి చేయగలదని ఆమె అన్నారు. మీడియా లేకపోతే కతువా, ఉన్నవ్ లాంటి ఘటనలు అసలు బయటికి వచ్చేవే కావని, మీడియా తెచ్చిన ఒత్తి డి వల్లే పోస్కో చట్టానికి మార్పు సాధ్యమైందని తెలిపారు. దీంతో మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి ఉరిశిక్ష విధించాలనే కొత్త చట్టం అమలులోకి వచ్చిందన్నారు. ఇందుకు మీడియాకు ధన్యవాదాలు చెప్పారు.

Comments

comments