Search
Saturday 17 November 2018
  • :
  • :

రాజకీయాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్

Bollywood celebrities who spoke about casting couch

ముంబయి: క్యాస్ట్టింగ్ కౌచ్.. కొంతకాలంగా టాలీవుడ్‌ను, బాలీవుడ్‌ను కుదిపేస్తున్న అంశం. క్యాస్ట్టింగ్ కౌచ్ సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉందని, ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అలాగే, క్యాస్ట్టింగ్ కౌచ్ ఒక్క  సినీ పరిశ్రమకే పరిమితం కాదని, అన్ని చోట్ల ఉందని కాం గ్రెస్  సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిజెపి సీనియర్ నాయకుడు శత్రు ఘ్న సిన్హా  కూడా క్యాస్ట్టింగ్ కౌచ్‌పై  వ్యాఖ్యలు చేయడం  మరింత సంచలన కలిగించింది. ‘లైంగిక ఆనందాలు, లైంగిక దోపిడీ అనేవి సినీ రంగంతో పాటు, రాజకీయ రంగంలో కూడా ఉన్నాయి’ అని శత్రుఘ్న సిన్హా  అన్నా రు. ఈ విషయంలో సరోజ్‌ఖాన్, రేణుకా చౌదరి  ఇద్దరూ కూడా సరిగానే వ్యాఖ్యానించారు. అది చాలా కాలంగా ఉన్న పద్ధతేనని, జీవితంలో ముందుకెళ్లాలంటే ఒక్కోసారి సమయం డిమాండ్ చేసినట్లుగా నడుచుకోవలసి ఉంటుందని సిన్హా అన్నారు. సరోజ్ ఖాన్ గొప్ప కొరియోగ్రాఫర్. ఆమె సినీ రంగంలో చాలా కాలంగా ఉన్నారు. బాలీవుడ్‌లో లైంగిక దోపిడీ గురించి మాట్లాడారంటె దానిగురించి ఆమెకు తెలిసే ఉంటుంది అని కూడా ఆయన అన్నారు.
‘ సినిమాల్లోకి రావడానికి అమ్మాయిలు ఏ విధంగా రాజీ పడతారో నాకు తెలుసు. సరోజ్ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను’ అని ఆయన అన్నారు. ఇక రేణుకా చౌదరి వ్యాఖ్యలతో కూడా తాను ఏకీభవిస్తానని ఆయన అన్నారు.‘రాజకీయాల్లో దీన్ని ఏమనాలో నాకు తెలియదు. బహుశా క్యాస్టింగ్ ఓట్‌కౌచ్ అనాలేమో. అయితే ఇది సరయినదని నేను అనను. ఇలాంటివి నాకుఎదురు కాలేదు.. అయితే మన చుట్టూ ఏం జరుగుతూ ఉందో మనం తెలుసుకోగలం కదా. అందుకే సరోజ్, రేణుక వ్యాఖ్యలను ఖండించకండి. అందుకు దారితీసిన పరిస్థితులను ఖండించండి’ అని శత్రుఘ్న సిన్హా అన్నారు.

Comments

comments