Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మహేష్ చిత్రానికి బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్

mb

సూపర్‌స్టార్ మహేష్‌బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సి.అశ్వనీదత్, దిల్‌రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కె.యు.మోహనన్ పనిచేయనున్నారు. హిందీలో డాన్, తలాష్, రయీస్ వంటి భారీ చిత్రాలకు అద్భుతమైన విజువల్స్‌ను అందించిన కె.యు.మోహనన్ ఇప్పుడు మహేష్‌బాబు నటించనున్న 25వ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి సంగీతంః దేవిశ్రీ ప్రసాద్, కథః వంశీ పైడిపల్లి, హరి, సాల్మన్.

Comments

comments