Search
Friday 21 September 2018
  • :
  • :

సినిమా రచయిత ఆత్మహత్య

Bollywood Film Writer Commits Suicide at Mumbai

ముంబయి : బాలీవుడ్ సినిమా రచయిత రవిశంకర్ అలోక్ (32) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన నివాస భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంథేరీ వెస్ట్‌లోని సెవన్ బంగ్లాస్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. నానా పటేకర్ నటించిన అబ్ తక్ చప్పన్ చిత్రానికి రవిశంకర్ రచయితగా పని చేశాడు. సరైన అవకాశాలు లేకపోవడంతో అతను డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, ఈ కారణంతోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం రవిశంకర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Bollywood Film Writer Commits Suicide at Mumbai

Comments

comments