Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తారల అందాలకు మెడిసిన్ మెరుగులు

bolly

ఇప్పుడు బాలీవుడ్‌లో ఏ భామను చూసినా చక్కని ఆకారంతో… తెల్లటి నునుపైన శరీరంతో మెరిసిపోతున్నారు. బాలీవుడ్ టాప్ మోస్ట్ బ్యూటీ దీపికా పదుకునే నుంచి… షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ వరకు ఎవరినీ చూసినా సొగసులన్నీ కలబోసినట్లుగా కనిపిస్తున్నారు. ఇంతగా వీరు తీర్చిదిద్దిన రూపంతో కనిపించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గతంలో దీపిక రూపానికి ఇప్పటి ఈ భామ అందానికి మధ్య చాలానే తేడా ఉంది. కెరీర్ ప్రారంభంలో చామన ఛాయతో కనిపించిన ఈ వయ్యారి… ఇప్పుడు నునుపైన పాల నురుగులాంటి దేహంతో కనిపిస్తోంది. అజయ్‌దేవ్‌గణ్ భార్య కాజోల్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈమె కూడా ముందుకంటే తెల్లగా మెరిసిపోతూ ఆకట్టుకుంటోంది. చాక్లెట్ బ్రౌన్ కలర్‌లో ఉండే మలైకా అరోరా స్కిన్ టోన్ కూడా ఇప్పుడు ఫెయిర్‌గా మారిపోయింది. ఈ భామ వయసుమీరుతున్నా కూడా తెల్లగా, ఆకర్షణీయంగా మురిపిస్తోంది. ఈవిధంగా బాలీవుడ్ భామలు ముందుగా చామన ఛాయలో ఉండి ఆతర్వాత తెల్లగా మెరిసిపోతూ కనిపిస్తున్నారు. దీని కోసం ఈ బ్యూటీలంతా స్కిన్ లైటెనింగ్ ట్రీట్‌మెంట్‌ను ప్రత్యేకంగా తీసుకుంటున్నారు. గ్లుటాథియోన్ అనే సూపర్ యాంటీ ఆక్సిడెంట్‌ను స్పెషల్ కేర్‌తో వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడమే ఈ తెలుపైన చర్మానికి అసలు కారణం. ఇక ముఖం ఆకారాన్ని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి కూడా ప్రత్యేకమైన ట్రీట్‌మెంట్ ఉంది. బాటాక్స్ ఇంజక్షన్స్ తీసుకోవడంతో ముఖం ఆకారాన్ని అనుకున్న విధంగా మార్చుకునే వెసులుబాటు ఉంది. ప్రియాంకా చోప్రా నుంచి గౌరీఖాన్ వరకు అందరూ ఇలాంటి ట్రీట్‌మెంట్ తీసుకున్నవారే. కాకపోతే ఇవన్నీ నిపుణులు, అనుభవజ్ఞుల పర్యవేక్షణలోనే జరగాల్సి ఉంటుంది. లేకపోతే అందచందాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Comments

comments