Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కేన్స్‌లో బాలీవుడ్ క్వీన్స్ సందడి

deepika

71వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ తారలు దుమ్ము రేపుతున్నారు. ఫ్రాన్స్‌లో ఈనెల 19 వరకు జరిగే ఈ వేడుకలో హాలీవుడ్ స్టార్లకు ధీటుగా బాలీవుడ్ భామలు మెరుపులు మెరిపిస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మీద అందాలొలికిస్తున్నారు బాలీవుడ్ హీరోయిన్‌లు. బాలీవుడ్ క్వీన్స్ దీపికా పదుకునే, కంగనా రనౌత్, మల్లికా షెరావత్ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. కేన్స్ రెండవ రోజు పొడవాటి తెలుపు రంగు గౌన్‌లో బ్యూటీక్వీన్‌ల కనిపించిన దీపిక మూడవ రోజు పింక్ కలర్ డ్రెస్సులో మురిపించింది. హాలీవుడ్ రేంజ్‌లో స్టైలిష్ లుక్‌తో ఆమె మైమరపించింది. దీపిక క్లీవేజ్ అందాలు కనువిందుచేశాయి. కేన్స్‌లో మెరవడం దీపికకు ఇది రెండవసారి. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనారనౌత్ కూడా కేన్స్‌లో మెరుపులు మెరిపిస్తోంది. హాలీవుడ్ పాప్ సింగర్స్ తరహాలో జంప్ సూట్ వేసుకొని వచ్చి రెడ్‌కార్పెట్‌పై నడిచి మురిపించింది. క్లీవేజ్ అందాలతో ఆకట్టుకుంది కంగనా. ఇక ఈ వేడుకకు హాజరయ్యేందుకు మరో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇప్పటికే తన కుమార్తెతో కలిసి కేన్స్‌కు విచ్చేసింది. కేన్స్‌లో ఐష్ సందడి చేయడం ఇది 17వ సారి కావడం విశేషం. తాజాగా వివాహం చేసుకున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ కూడా ఈనెల 14, 15వ తేదీల్లో రెడ్‌కార్పెట్‌పై నడిచి మురిపించనుంది.

Comments

comments