Search
Saturday 22 September 2018
  • :
  • :

అక్షయ్ కుమార్ దిమ్మ తిరిగే సమాధానం… ఎవరికి? దేనికి?

akshaykumar

అబ్బబ్బబ్బబ్బ… అక్షయ్ కుమార్ చింపేశాడు పో… బీభత్సంగా కౌంటర్ ఇచ్చాడు పో…. వాళ్లకు దిమ్మ తిరిగిపోయుంటుంది.. ఏమంటారు?.. ఇంతకీ ఏ సినిమాలోని డైలాగ్స్ తో ఇరగదీశాడని మాత్రం అడగకండి.. ఎందుకంటే.. ఇది రీల్ షో కాదు.. రియల్ షో.. అవును… రియల్ గానే అక్షయ్ కుమార్ హీరో అనిపించుకున్నాడు.

అసలు విషయం ఏంటంటే? ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు విపరీతంగా వస్తున్నాయి. దీపావళికి పనికిమాలిన బాంబులు కొని కాల్చేకంటే పేదోళ్లకు ఆ డబ్బులు పంచండి అని….చాలా మంది దీపావళికి వేలకు వేలు ఖర్చు పెట్టి మరి బాంబులను పేల్చి ఆనందంగా దీపావళిని జరుపుకుంటారు. అది ఆచారం.. ఎప్పటి నుంచో ఇండియాలో ఎక్కడైనా బాంబులను పేల్చడం అలవాటు.

అయితే, దీపావళికి ఎందుకు పనికిమాలిన బాంబులు కాల్చి డబ్బులు వేస్ట్ చేసుకుంటారనే కామెంట్ పై అక్షయ్ కుమార్ తనదైన శైలిలో స్పందించాడు.

ఎలా అంటే….

‘ఓకే.. అలాగే చేద్దాం… మరి కొత్త సంవత్సరం రాగానే మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కొన్ని వేల కోట్లు తగలేస్తున్నారు కదా.. మరి అప్పుడు పేదోడి గురించి ఆలోచించరా… అప్పుడు గుర్తుకు రాలేదా పేదోడి ఆకలి…

ఏదైనా రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరైనా నాయకుడు గెలిచినా.. చివరకు ఊళ్లో సర్పంచ్, ఎంపిటిసి లాంటి ఎన్నికల్లోనూ డబ్బులు తగలెట్టి బాంబులు కాలుస్తారు కదా.. మరి అప్పుడు గుర్తుకురాడా పేదోడు…ఇంకా, రాజకీయ నాయకుల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తారు కదా… మరి అప్పుడు గుర్తుకు రాలేదా పేదోడి ఆకలి.. కాని, ఏదైనా గుళ్లో దేవుడికి పాలాభిషేకం చేస్తే మాత్రం పేదోడి ఆకలి అంటారు..

దేశంలోని ఎన్నో పుణ్య క్షేత్రాల్లో ప్రతి రోజు అన్నదానాలు జరుగుతాయి.. మరి, ఇవి కనపడవా మీకు…

బార్లల్లో వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి బీర్లు, బ్రాండీలు తాగేవాడికి పేదోడు గుర్తుకురాడా… వాడి ఆకలి గుర్తుకురాదా…

ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి రోజున కొన్ని బాంబులు కాల్చి.. ఆనందంగా కుటుంబంతో గడపడం తప్పా…

అసలు… టపాసులు లేని దీపావళి… రంగులు లేని హోళీ ఉంటుందా…

ఇప్పటికైనా మారండి… పనికి మాలిన సందేశాలు ఇవ్వడం మానండి… చేతనైతే పేదోడికి మీ వంతు సాయం చేయండి.. ఇంకా.. పేదోడిని ఆదుకోవాలంటే మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించుకోండి.. కేెబుల్ టీవీ తొలగించండి… ఇంకా, వీలైతే న్యూ ఇయర్ రోజున రోడ్డు మీద తాగి తందనాలు ఆడకుండా ఆ రోజు కొంతమంది పేదోళ్లకు దానం చేయండి…’

Comments

comments