Home గాసిప్స్ వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్..!!?

వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్..!!?

ArjunKapoorandMalikaArora

అర్జున్ కపూర్.. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు ను తెచ్చుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇక, మలైకా అరోరా… ఆల్ రెడీ పెళ్లి కూడా అయిపోయింది. పిల్లలు కూడా. భర్త కూడా బాలీవుడ్ నటుడే, హీరో సల్మాన్ ఖాన్ సోదరుడే.. పేరు అర్భాజ్ ఖాన్. కాని, భర్తతో విడిపోయింది.

అయితే, ఎటువంటి సంబంధం లేని, అర్జున్ కపూర్, మలైకా అరోరా… ఇప్పుడు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని గొంతు పోయేలా మొత్తుకుంటోంది బాలీవుడ్ ఇండస్ట్రీ.

ఈ మధ్య చాలా సార్లు అర్జున్ కపూర్… మలైకా ఇంటికి వెళ్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఓ వీడియో కంటికి చిక్కాడట. ఇంకేం… వీళ్లిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్.. సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తున్నదంటూ…సోషల్ మీడియాలో ఆ వీడియో వైరలయి కూర్చుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అర్జున్…మలైకా కంటే చిన్నవాడు.

ఇక, వీళ్లిద్దరి తతంగాన్ని తెలుసుకున్న బోనీ కపూర్.. అర్జున్ పై కోప్పడ్డాడట. అయినా కూడా, మలైకా తో తిరగడం మాత్రం ఆపట్లేదట అర్జున్. ఇక, కొడుకు తన మాట వినకుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతుండటంతో ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడట బోనీ కపూర్.

దానికి సంబంధించిన వీడియో ఇదే….