Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

పంగనామాలు

సైఫ్-కరీనా, కరిష్మాకపూర్, విడియోకాన్ అధినేత వేణు

తాజాగా లీకైన పనామా పత్రాలలో బాలీవుడ్  దంప తులు  సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, కరిష్మా కపూర్, విడియోకాన్ అధినేత వేణు పేర్లు వెలుగులోకి వచ్చాయి.

panamaముంబై: తాజాగా పనామా పత్రాలలో మరి బాలీవుడ్ ఫేంల పేర్లు వెల్లడి అయ్యాయి. బాలీవుడ్ దంపతులు సైఫ్ అలీఖాన్, కరీనాకపూర్‌తో పాటు కరీనా సోదరి కపూర్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. 2010లో ఐపిఎల్ బిడ్డింగులలో భాగంగా బ్రిటి ష్ వర్జిన్ ఐల్యాండ్స్‌లో నమోదు అయిన నకిలీ సంస్థలలో ఈ సినీ ప్రముఖులు భాగస్వాములుగా ఉన్నట్టు పనామా పత్రాలు వెల్లడించాయి. పనామాకు చెందిన ఆర్థిక వ్యవ హారాల న్యాయ నిర్వహక సంస్థ మోసాక్ ఫోన్సెకా రికా ర్డులను పరిశోధనాత్మక జర్నలిస్టుల సమాఖ్య (ఐసిఐజె) వెలుగులోకి తెచ్చింది. పలు దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు, దేశాధినేతలు, వ్యాపార వేత్తలు పలు రకాలుగా అక్రమాలకు పాల్పడ్డట్టు ఆఫ్‌షోర్ కంపెనీలలో భారీగా అక్రమ మదుపులు పెట్టినట్లు పనామా పత్రాలలో పేర్కొన్న 500 మంది భారతీయుల పేర్లలో సినీ టాప్ హీరో అమితాబ్ బచ్చన్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు సైఫ్ అలీఖాన్, కరీనా, కరిష్మాల పేర్లు కూడా వచ్చాయి. 2010లో పది మంది సభ్యులతో పి విజన్ స్పోర్ట్ లిమిటెడ్ పేరుతో సంస్థ ఏర్పాటయింది . ఈ సంస్థ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజ్ కోసం విఫల యత్నం చేశారు . ఈ కన్సార్టియంలో సైఫ్ అలీఖాన్ భార్య నటి కరీనా, కరీనా సోదరి కరిష్మాకు వా టాలు ఉన్నట్లు తాజా పత్రాలలో వెల్లడించారు. పనామా పత్రాల నాలుగో భాగంగా ఈ పత్రాలను విడుదల చేశారు. ఆ విదేశీ కంపెనీలో సైఫ్‌కు 9 శాతం, కరీనా, కరి ష్మాలకు చెరో నాలుగున్నర శాతం వాటాలు ఉన్నట్లు తేల్చారు. ఇదే సంస్థ పరిధిలో బ్రిటిష్ ఐల్యాండ్స్‌లో అబుబురేట్ లిమిటెడ్ అనే మరో నకిలీ సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు పత్రాల ద్వారా తెలిపారు. నల్లధనం వ్యవహారం పలుకుబడితో పెనవేసుకుని పోయిన వైనం తాజా గా వెలుగులోకి వస్తోన్న పనామా పేపర్స్‌తో రుజువు అవుతోన్న దశలో ఇప్పుడు ఈ బాలీవుడ్ బామల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీనిపై స్పందించేందుకు కరీనా, కరిష్మాలు , సైఫ్ అందుబాటులో లేరని వెల్లడైంది. ఇక వీరితో పాటు వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ ధూత్ కు చెందిన పలు సంస్థలు కూడా పనామా పత్రాలలో ఉన్నాయి. 2010లో ఐపిఎల్ పుణే ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకునేందుకు వీడియోకాన్, పంచశీల గ్రూప్‌తో పాటు బాలీవుడ్ సెలబ్రిటిలు సైఫ్ అలీ, కరీనా, కరిష్మాలు జట్టు కట్టారు. వీరితో పాటు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ ఓడ్యుబరేట్ లిమిటెడ్ కూడా భాగంగా ఉందని వెల్లడైంది. మొత్తం పది మంది కలిసి పీ – విజన్ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కన్సార్టియంను ఏర్పాటు చేసి పుణే ఫ్రాంచైజ్ కోసం బిడ్ వేశారు. అయితే ఈ ప్రయత్నంలో సంస్థ విఫలం అయింది. కానీ ఇప్పుడు అప్పుడు వారు సాగించిన తెరవెనుక వ్యవహారాల ఈ పనామా పేపర్స్‌తో వెల్లడయ్యాయి. పనామా పత్రాల నాలుగో పార్ట్‌లో పి విజన్ , ఓడ్యుబరేట్ పేర్లు చోటు చేసుకున్నాయి. పి విజన్ క్రీడల కన్సార్టియంలో చోర్డి యా కుటుంబానికి 33 శాతం వాటా ఉన్నట్లు తెలిసింది. ఇక ముంబై నివాసం మనోజ్ ఎస్ జైన్ 9 శాతం పెట్టు బడులు పెట్టారు. ఇక వీడియోకాన్ వేణు రెండు గ్రూప్ కంపెనీలతో పాతిక శాతం, పంచశీల వారు 33 శాతం వాటాలు పెట్టినట్లు వెల్లడైంది. ఓడ్యుబరేట్ వెనుక ఐపిఎ ల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఉన్నాడనే అనుమా నాలు వ్యక్తమయ్యాయి. పనామా పత్రాల నాలుగో భా గంలో ఢిల్లీకి చెందిన టైర్ డీలర్, ఒక దుకాణం యజ మాని, ఓ ఆస్ట్రేలియన్ గని బిలియనీర్ కుమార్తె, ఓ వస్త్రా ల ఎగుమతిదారుడు, ఓ ఇంజినీరింగ్ కంపెనీ యజమా ని, లోహాల సంస్థ డైరెక్టరు, ఓ చార్డర్డ్ అకౌంటెంట్ ఉన్నా రు. సైఫ్, కరీనా, కరిష్మా, వీడియోకాన్ అధినేతలు పెట్టి న కంపెనీని ఐపిఎల్ బిడ్డింగ్ తరువాత మూసివేశారు.
పి విజన్ స్పోర్ట్‌లో పాతిక శాతం వాటా
తనకు పి విజన్ స్పోర్ట్‌లో పాతిక శాతం వాటా ఉందని అయి తే తనకు ఓడ్యుబరేట్ గురించి తెలియదని వేణుగోపాల్ ధూత్ తెలిపారు. ఇక అతుల్ ఛోర్దియా స్పం దిస్తూ తమసంస్థ వందశాతం స్పోర్ట్ సంస్థగా ఉందని తమ సంస్థలో ఆఫ్‌షోర్ సంస్థల షేర్లు లేవని తెలిపారు. తాజా పత్రాలలో ఎక్కువగా భారతీయ క్రీడా ఈవెంట్ల సంబంధితుల పేర్లు ఉండటంతో ఇప్పుడు క్రీడారంగం లో సంచలనం చెలరేగింది. ట్వంటీ ఫస్ట్ సెంచరీ మీడి యా అనే స్పోర్ట్ నిర్వహణ దిగ్గజ సంస్థ ఎండి లోకేష్ శర్మ పేరు కూడా పత్రాలలో ఉంది. ఆయనకు ఆయన పేరు మీద వర్జిన్ ఐల్యాండ్స్‌లో రెండు నమోదిత కంపెనీ లు ఉన్నాయి. మరోటి స్పోర్ట్ కంపెనికీ అనుబంధంగా ఉందని . అయితే అక్కడి కంపెనీ మార్గరిటా సర్వీసెస్‌ను ఓ ఓవర్సీస్ సోలిసిటర్ ద్వారా నడిపిస్తున్నట్లు, దీని నుం చి తాను షేర్లు తీసుకోలేదన , దీనిని తాను నిర్వహిం చడం లేదని శర్మ వివరణ ఇచ్చుకున్నారు.

Comments

comments