Home ఆఫ్ బీట్ అనంతలోకాలకు అతిలోక సుందరి

అనంతలోకాలకు అతిలోక సుందరి

SREE-DEVI

హైదరాబాద్ :  అందాల తార శ్రీదేవి శనివారం  ఉదయం తుదిశ్వాస విడిచారు. దుబాయ్‌లో  జరిగిన ఓ పెళ్లి వేడుకలలో నటి శ్రీదేవి(54)  గుండెపోటుతో  కన్నుమూశారని సంజయ్ కపూర్ ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు శ్రీదేవి దుబాయ్ కి వెళ్లారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు, అమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె  చికిత్సపొందుతూ మృతి చెందారు.  తెలుగు, హిందీ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో ఆమె 200లకు పైగా చిత్రాల్లో నటించారు. శ్రీదేవి హఠాన్మరణంతో… సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆమె మృతిపట్ల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని  తెలిపారు. బాలీవుడ్ నిర్మాత, హీరో అనిల్ కపూర్ సోదరుడు బోనీ కపూర్‌ను1996లో శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కుమారైలు జాహ్నవి, ఖుషి. 1963, ఆగస్టు 13న శివకాశిలో పుట్టిన శ్రీదేవి.. 1967లో బాలనటిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు.

హీరోయిన్‌గా శ్రీదేవి తొలి చిత్రాలు.. తెలుగులో పదహారేళ్ల వయసు, హిందీలో సోల్వా సావన్. 1976లో కె. బాలచందర్ దర్శకత్వం వహించిన మాండ్రు ముడిచులో కమల్‌హాసన్, రజనీకాంత్‌లతో కలిసి నటించి.. ఆవిడ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని పలువురి ప్రశంసలు పొందారు. 1975-85 మధ్య కాలంలో తెలుగు, తమిళంలో ఆమె అగ్రస్థాన కథనాయిక స్థానానికి ఎదిగారు. 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో శ్రీదేవి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇటీవలే మామ్ చిత్రంతో నటించి అందరిని అలరించారు. 200లకు పైగా సిన్మాల్లో నటించిన ఆమె తెలుగులో అగ్రనటులతో కలిసి పనిచేసింది.  తెలుగు 85, తమిళం 72, మళయాలం 26, హిందీ 71 సినిమాల్లో నటించి లక్షల్లో  అభిమానులను కూడకట్టుకుంది. 15 ఫిలింఫేర్ అవార్డులు అమె సొంతం చేసుకుంది. 2013లో శ్రీదేవిని పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. శ్రీదేవి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. శ్రీదేవి కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.