Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వాజ్ పేయి మృతిపై సినీ ప్రముఖల సంతాపం

Bollywood, Tollywood and Kollywood celebrities condolence on Vajpayee death

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి గురువారం సాయంత్రం ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో దేశమంతా ఒక్కసారిగా మూగబోయింది. వాజ్ పేయి మృతిపై బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన  ప్రముఖనటులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

మహానేత, గొప్పకవి, వక్తకు శ్రద్ధాంజలి : అమితాబ్

వాజ్ పేయి మరణవార్త తీవ్ర దు:ఖాన్ని కలిగించింది : రజనీకాంత్

తాను చూసిన ఉత్తమ ప్రధానుల్లో వాజ్ పేయి ఒకరు. దేశం ఎన్నడూ చూడని గొప్ప ప్రధాని వాజ్ పేయి అని నటుడు మోహన్ లాల్ అన్నారు.

దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని జూనియర్ ఎన్ టిఆర్ అన్నారు. స్వర్ణ చతుర్భుజ ద్వారా దేశాన్ని ఏకం చేసిన దార్శనికుడు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వాజ్ పేయి ఎన్ టిఆర్ తెలిపారు.

గొప్ప మనిషిని కోల్పోయాం. వాజ్ పేయి ఇక లేరన్న వార్త తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. వాజ్ పేయి కుటుంబానికి నటుడు ధనుష్  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రాజకీయాలకు వన్నె తెచ్చిన అతికొద్ది మంది రాజనీతిజ్ఞుల్లో వాజ్ పేయి ఒకరని దర్శకుడు రాజమౌళి అన్నారు. రహదారుల అనుసంధానం అనే వాజ్ పేయి విజన్ దేశంలో బతుకుతున్నకోట్ల మంది జీవితాలను మార్చిందన్నారు. తన ప్రియమైన నేతకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని రాజమౌళి తెలిపారు.

నిజమైన నాయకుడు, యావత్తు దేశం మిమ్మల్ని కోల్పోయింది. అటల్ బిహారి వాజ్ పేయి జ్ఞానం, నిజాయతిని… ప్రతి నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలన్నారు దర్శకుడు కొరటాల శివ. వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

Comments

comments