Home అంతర్జాతీయ వార్తలు దుర్రాని కాన్వాయ్‌పై బాంబు దాడి

దుర్రాని కాన్వాయ్‌పై బాంబు దాడి

Bomb Attack on Durrani Convoy : Four People died

పాక్ : పాక్‌లోని బన్నులో జమైత్ – ఎ- ఉలేమా ఇస్లాం నేత, నేషనల్ అసెంబ్లీ మెంబర్ అక్రమ్ ఖాన్ దుర్రాని కాన్వాయ్‌పై దుండగులు బాంబుతో దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే దుర్రాని మాత్రం ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిందెవరన్నది తెలియరాలేదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Bomb Attack on Durrani Convoy : Four People died