Home తాజా వార్తలు బీజింగ్ లో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు

బీజింగ్ లో అమెరికా ఎంబసీ వద్ద పేలుడు

Beijing

బీజింగ్: చైనాలోని బీజింగ్ లో అమెరికా రాయబార కార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది. పేలుడు జరగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పలువురు గాయపడినట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో భారత ఎంబసి  ఉంది. పేలుడు జరిగిన కొద్ది సేపటికి ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.  పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.