Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు…

Trine-image

లక్నో: న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు శనివారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి రైలు బయల్దేరిన గంట సేపటికి రైలులో బాంబు పెట్టినట్టు దుండగులు రైల్వే అధికారులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఘజియాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలును ఆపేశారు. ప్రయాణికులందరిని రైల్లో నుంచి కిందకు దింపి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాంబు, డాగ్ స్కాడ్‌లతో పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు. బాంబు బెదిరింపు ఫోన్ కాల్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Comments

comments