Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

3-డి ప్రింటర్ ఎముకలు

3D-Printerఎముకలు విరిగినా, ఎముకలు మార్చాలన్నా, దెబ్బతిన్న ఎముకల స్థానంలో కొత్త ఎముకలు అమర్చడం ఇకపై అంత కష్టమైన పని కాదన్నారు. సూపర్ ఫ్లెక్సిబుల్, 3-డి ప్రింటెడ్ ఎముకలు అమర్చడం ద్వారా శరీరంలోని ఎముకలు సహజసిద్ధంగా పెరుగుతాయట. అందుకే సూపర్ ఫ్లెక్సిబుల్, 3-డి ప్రింటెడ్ తొడ ఎముక, పుర్రె పైభాగం, ఎముకల ఆకృతులు తయారుచేస్తున్నారు. ఈ సూపర్‌ఫ్లెక్సిబుల్ పదార్థం ఎలాస్టిక్‌పావియర్, హైడ్రోక్సియాపటైట్‌ల సమ్మిశ్రమం. మనిషి ఎముకలు, దంతాల్లో కాల్షియం మినరల్ దాగి ఉంటాయి. ఎప్పుడైతే సూపర్‌ఫ్లెక్సిబుల్ 3-డి ప్రింటెడ్‌ను అమరుస్తారో అందులో ఉండే మినరల్ మేకప్ ఒక్క నెలలోపే ఎముక సహజంగా ఎదిగేలా చేస్తుంది. అయితే ఇప్పటివరకు ఎలుకల మీద మాత్రమే ప్రయోగించారు. అంటు కట్టినంత సహజంగా ఇక్కడ టిష్యు, ఎముకల ఎదుగుదల జరిగింది. ఇందుకు కారణం సూపర్‌ఫ్లెక్సిబుల్ 3-డి సుతిమెత్తని పదార్థం కావడం, సర్జన్‌లు గమ్ పెట్టకుండా కుట్లు వేయకుండా దానిని అతికించగలగడం. ఇందుకు కారణమంటారు షా. అంతేకాదు ఈ రకంగా ఎదిగిన ఎముకలు 150 పౌండ్ల బరువును మోసే శక్తిని కలిగి ఉంటాయి.

Comments

comments