Home జయశంకర్ భూపాలపల్లి బుక్కొకటి…..చెక్కొకటి

బుక్కొకటి…..చెక్కొకటి

check-image

అధికారుల నిర్లక్షం తప్పుల తడకగా రైతుబంధు

మన తెలంగాణ/భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు చెక్కుల పంపిణీలో తప్పుల తడకగా మారింది అధికారుల నిర్లక్షం, రెవిన్యూ అధికారుల అసమర్థతపని వెరసి చెక్కుల పంపిణీలో అధికారుల నిర్లక్షం వల్ల రైతులకు అందాల్సిన చెక్కులు ఒకరి పేరుకు బదులు మరోకరి పేర్లతో, పాస్ బుక్ ఒకరిది.. చెక్కుమీద పేర్లు మరొకరిది  ఇచ్చి రైతులను ఆందోళనకు, గందర గోళానికి గురిచేసిన సంఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారం  గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గరిమిళ్ల సత్యనారయణరెడ్డికి ఖాత నెంబర్ 10676 లో గ్రామంలో 30 గుంటల భూమి ఉంది పాస్ బుక్‌లో 26 గుంటలు మాత్రమే పాస్‌బుక్‌లోకి ఎక్కించారు. మిగిలిన 4 గుంటల భూమిని వదిలేశారు. అలాగే తనకు ఇచ్చిన చెక్కు మీద పలకల రాంరెడ్డి పేరు మీద రెవెన్యూ అధికారులు సదరు రైతు సత్యనారాయణకు పలకల రాంరెడ్డి పేరు మీద చెక్కును వ్రాసి ఇవ్వడం జరిగింది. వెంటనే రైతు సత్యనారాయణరెడ్డి ఆందోళన చెంది రెవిన్యూ అధికారులను సంప్రదించడం జరిగింది. అధికాలరులు నిర్లక్షంగా దాటవేసే సమాదనం చెప్పుతున్నారని సదరు రైతు విలపిస్తు తెలిపారు. ఇప్పటికైన అధికారులు ఇలాంటి నిర్లక్షాన్ని వీడి మరో సారి పునరావృతం కాకుండ జిల్లా అధికారులు చూడాలని రైతులు వేడుకుంటున్నారు.