Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి బోపన్న,పేస్

సానియా-హింగిస్ జంటకు షాక్

tennisపారిస్: వరుసగా నాలుగో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు ఊహించని షాక్ ఎదురైంది. గతేడాది వింబుల్డన్, యుఎస్ ఓపెన్… ఈ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఈ ఇండో-స్విస్ జోడీకి ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన మూడో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సానియా-హింగిస్ జోడీ 3-6, 2-6తో క్రెజ్‌సికోవా-సినియకోవా (చెక్ రిపబ్లిక్) జంట చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)-కుద్రయెత్సెవా (రష్యా) జంట 6-2, 3-6, 8-10తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)-హావో చింగ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి పాలైంది.
పురుషుల డబుల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లియాండర్ పేస్ (భారత్)-మట్కోవ్‌స్కీ (పోలండ్) 7-6 (7/5), 7-6 (7/4)తో జేమీ ముర్రే (బ్రిటన్)-బ్రూనో సొరెస్ (బ్రెజిల్)లపై… రోహన్ బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) 6-2, 6-7 (4/7), 6-1తో బాకెర్ (అమెరికా)-డానియల్ (న్యూజిలాండ్)లపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.

Comments

comments