Search
Saturday 22 September 2018
  • :
  • :

సరికొత్త గడ్డాలతో సందడి చేస్తున్న కుర్రకారు

bored is also going to change hairstyle for youth season

యువత సీజన్‌ను బట్టి హెయిర్‌స్టైల్స్ మారుస్తోంది కానీ ఇప్పుడు గడ్డానికి కూడా ట్రెండ్ నడుస్తోంది.  విరాట్ కోహ్లీ, డేవిడ్ బెక్‌హమ్ లాంటి స్పోర్ట్స్ స్టార్లతో పాటుగా రణ్‌వీర్, షాహిద్, అక్షయ్, షారూఖ్ లాంటి బాలీవుడ్ స్టార్లు, అల్లు అర్జున్, ఎన్‌టిఆర్ లాంటి టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు ఈ గడ్డాలతో ప్రయోగాలు చేస్తుండటంతో ఫ్యాషన్ అభిమానులు కూడా వీటికి సై అంటున్నారు. సిక్స్ ప్యాక్ ట్రెండ్ ఒకప్పుడు ఎలా కొనసాగిందో అదే రీతిలో ఇప్పుడు ఈ గడ్డాలలో కూడా ట్రెండ్ కొనసాగుతోంది.

షార్టర్ లాంగ్ గడ్డం..
ఈ స్టైల్ పొందడం కాస్త కష్టమైంది. ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఉండటంతో పాటుగా విపరీతమైన ఓపిక కూడా కావాలి. కాకపోతే బెస్ట్ గడ్డం శైలిలో ఒకటిగా ఇది మాత్రం ఇప్పుడు మార్కెట్‌లో సంచనాలను సృష్టిస్తోంది. ముఖాకృతి అనుసరించి ఈ శైలి ఉంటుంది. అయితే ఈ గడ్డం పట్ల జాగ్రత్త చూపడం కూడా అవసరమే, ఎందుకంటే ఎక్కువ గడ్డం ఉండటం వల్ల ర్యాష్, చుండ్రు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట.

హెవీ స్టబెల్
అబ్బాయిల్లో అమ్మాయిలు ఇష్టపడే గడ్డాలలో మొదటిస్థానం ఈ ఫేషియల్ స్టబెల్‌దేనన్నది పరిశోధకుల మాట. ఆస్ట్రేలియన్ అధ్యయనం ఒకటైతే హెవీ స్టబెల్ మోస్ట్ సెక్సీ గడ్డం అని అంటుంది. ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు జార్జ్ క్లూనీ, రేయాన్ గోస్లింగ్ లాంటి వారు ఈ గడ్డం అనుసరిస్తున్నారు. పది రోజుల పాటు గడ్డం పెంచి ఆ తరువాత ట్రిమ్మర్‌తో ఎక్కడ ఉంచాలో ఉంచి మిగిలినది తగ్గించడమే ఈ స్టైల్.

వాన్ డికే..
గడ్డంలో విప్లవం తీసుకువచ్చిన స్టైల్ ఇదేనన్నది హెయిర్ స్టైలిస్ట్‌ల మాట. ఇటీవల సెలబ్రిటీలు ఎక్కువ మంది అనుసరిస్తున్న స్టైల్ ఇది. స్మార్ట్, ఫ్రెష్, స్టైలిష్‌గా ఉండే ఈ స్టైల్‌లో మీసం కాస్త హెవీగానే ఉండాలన్నది మొదటి సూత్రం. మన విరాట్ కోహ్లీ మొదలుకుని ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హమ్ వరకూ ఈ వాన్ డికే గడ్డంతోనే మురిసిపోతున్నారు. చిన్ హెయిర్‌తో కవరై ఉంటే చీక్స్ మాత్రం క్లీన్ షేవన్‌లా కనబడటం ఈ స్టైల్ స్పెషాలిటీ.

హ్యాండిల్‌బార్ ముస్టాక్
క్రికెటర్ రవీంద్ర జడేజా అనుసరిస్తున్న స్టైల్ ఇది. మీసం పైకి తిప్పి ఉండటమే కాదు గడ్డం కాస్త హెవీగా ఉన్నట్లు కనబడినా పెదాల మీదుగా షార్ట్ హెయిర్‌ను, లాంగ్ హెయిర్‌ను సైడ్స్‌కు దువ్వడం ఈ గడ్డంలో కనిపిస్తుంది. కాస్త వాక్స్‌ను ఈ గడ్డానికి అప్లయ్ చేస్తే కావాల్సిన షేప్ పొందవచ్చట.

Comments

comments