Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పసిగుడ్డు మృతి

babydiedషిఫా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పసిగుడ్డు మృతి, ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు బంధువులు,పోలీసుల రంగ ప్రవేశం
కాగజ్‌నగర్‌టౌన్‌ః కాగజ్‌నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో గల షిఫా పిల్లల ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ సోమవారం పసిగుడ్డు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే… రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన అరుణ, రాజు దంపతులకు సోమవారం ఆడ శిశువు జన్మించింది. మొదటి చికిత్స అందించడానికి తల్లిదండ్రులు అంబేద్కర్ చౌక్‌లో గల షిఫా పిల్లల ఆసుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పసిగుడ్డు మృతిచెందిన సంఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

డాక్టర్ అనుసూయ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు డాక్టర్‌తో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. డాక్టర్‌కు, కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుకోగా పట్టణ ఎస్సై అబ్దుల్ మజీద్ ఆసుప్రతికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా పసిగుడ్డు తల్లిదండ్రులు రాజు, అరుణలు మాట్లాడుతూ డాక్టర్ అనసూయ వల్లనే తమ బిడ్డ మృతిచెందిందని ఆరోపించారు. అనంతరం పోలీసుల జోక్యంతో బాధితులు డాక్టర్‌పై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Comments

comments