Home ఆదిలాబాద్ ఆదిలాబాద్ రిమ్స్‌లో పసికందు మాయం

ఆదిలాబాద్ రిమ్స్‌లో పసికందు మాయం

Born Baby Kidnap in RIMS in Adilabad District

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ డెలివరీ వార్డ్‌లో పసికందు మాయం అయింది. గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రిమ్స్ చేరుకొని అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. ఆసుపత్రిలో రికార్డైన సిసిటివి ఫుటేజీని పరిశీలించి పసికందును అపహరించిన నిందితులను పోలీసులు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, బాధితురాలు నార్నూర్ మండలం చోర్‌గామ్ వాసి మమతగా గుర్తించారు. మమత కాన్పు కోసం ఈనెల 2న రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఈ నెల 7న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో ప్రస్తుతం రిమ్స్‌లో ఆందోళనకర వాతావరణం నెలకొంది.