Home తాజా వార్తలు నడి రోడ్డుపై ఆడ శిశువు

నడి రోడ్డుపై ఆడ శిశువు

               baby-born

దామరచర్ల: న‌ల్ల‌గొండ జిల్లాలోని దామరచర్ల మండల కేంద్రంలో విషాద సంఘ‌ట‌న జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును నడి రోడ్డు పై వదిలేసి వెళ్లిపోయారు. ఆదివారం ఉదయం  పసికందును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.  ఘటనా స్థలానికి పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు చేరుకొని శిశువును ఆస్పత్రికి తరలించారు. శిశువు ఆరోగ్యంగా ఉంద‌ని వైద్యులు తెల‌ప‌డంతో అందరు ఊప‌రి పీల్చుకున్నారు.పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. ప్రస్తుతం శిశువును శిశువిహార్‌కు త‌ర‌లించారు.