Search
Saturday 17 November 2018
  • :
  • :

ఉద్యోగి ఆత్మహత్యకు బాస్‌ది బాధ్యత కాదు

Supreme respond on SC and ST judgment

న్యూఢిల్లీ : పని ఒత్తిడితో ఉద్యోగి ఆత్మహత్య చేసుకు ంటే  సంబంధిత అధికారిపై కేసు పెట్టడం భా వ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసు ను  కొట్టివేసింది.  పనిభారం అధికంగా మోపడం ద్వారా ఉన్నతాధికారి కింది స్థాయి ఉద్యోగి ఆత్మహత్యకు కారకుడు అయ్యాడని కేసు దాఖలు అయింది. సద రు అధికారిని కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. పని అప్పగించడాన్ని ఆత్మహత్యకు పురికొల్పడంగా ఏ విధంగా భావిస్తారని న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, యుయు లలిత్‌తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆత్మహత్యకు కావాలని అంటే ఉద్ధేశపూర్వకంగా పరిస్థితులు కల్పిండం జరిగితే, తద్వా రా వ్యక్తి ప్రాణాలు తీసుకుంటే అది సంబంధిత నేరాభియోగం పరిధిలోకి రాదని ధర్మాసనం స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఆఫీసరుపై ఆత్మాహత్య ప్రేరణ కేసు నమోదైంది. తనపై వచ్చిన అభియోగాలను సవాలు చేస్తూ తొలుత ఆయన బొంబాయి హైకోర్టుకు వెళ్లారు. క్రిమినల్ విచారణను నిలిపివేయాలని అభ్యర్థించారు. అయితే దీనిని హైకోర్టు కొట్టివేయడంతో ఆ అధికారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భర్తకు తరచూ అధిక పని అప్పగించడంతో ఆయన ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని ఉద్యోగి భార్య కేసు పెట్టారు. సీనియర్ అధికారిగా దిగువ స్థాయి సిబ్బందికి పని అప్పగించడం జరుగుతుందని, ఇది కేవలం విధులకు సంబంధించిన అంశం అని, ఇందులో వక్ర బుద్ధి, నేరపూరిత చర్యలు ఉంటాయని అనుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక వ్యక్తిని నిర్థిష్టంగా ఎవరైనా కావాలనే  ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా పరిస్థితులు సృష్టించినట్లు అయితే , ఇది నిజమేనని నిర్థారణ అయితే కేసు నమోదు చేయవచ్చు.

Comments

comments