Home స్కోర్ మేరికోమ్, వికాస్‌లకు బాక్సింగ్ అవార్డులు

మేరికోమ్, వికాస్‌లకు బాక్సింగ్ అవార్డులు

marykomన్యూఢిల్లీ:  భారత బాక్సర్లు మేరీ కోమ్, వికాస్ కిషన్ యాదవ్‌లకు మరో అరుదైన గౌరవం లభించింది.  అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఎఐబిఎ) 70 వార్షికోత్సవ సందర్భంగా బుధవారం స్విట్జర్లాండ్‌లో ఈ  ప్రత్యేక అవార్డులు వీరికి దక్కాయి. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఎఐబిఎ  70వ వార్షికోత్సవంలో ఈ అవార్డులను వారికి ప్రదానం చేశారు.  ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ కాంస్య పతక విజేత అయిన ఎంసి మేరీ కోమ్‌కు ఎఐబిఎ లెజెండ్స్ అవార్డునిచ్చారు. ఇక ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వికాస్ కిషన్ యాదవ్‌కు ఎఐబిఎ ప్రో బాక్సింగ్  ‘బెస్ట్ బాక్సర్ ట్రోఫీ’ లభించిందని భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు.