Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

డబ్బు కోసం హిజ్రా వేషం.. దేహశుద్ధి చేసిన హిజ్రాలు..!

Fake-Transgenderహైదరాబాద్ : డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నా… దుర్భద్ధితో యువకుడు ఓ కొత్త (చెత్త) మార్గాన్ని ఎంచుకున్నాడు. కష్టపడకుండా.. డబ్బు సంపాదించేందుకు ఆ యువకుడు హిజ్రా వేషం వేశాడు. కథ అడ్డం తిరిగి చివరకు హిజ్రాలకే చిక్కాడు. దీంతో వాళ్లు అతన్ని చితక్కొట్టారు. ఈ విచిత్ర ఘటన నగరంలోని దిల్‌షుఖ్‌నగర్ చౌరస్తాలో చోటు చేసుకుంది.
హిజ్రా వేషం వేసిన సదరు యువకుడు చౌరస్తాలోని దుకాణ యజమానుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుండగా… అసలైన హిజ్రాలకు పట్టబడ్డాడు. దీంతో కోపోద్రిక్తులైన వాళ్లు నకిలీ హిజ్రాను చెప్పులతో చితకొట్టారు. అతడి ఒంటిపై ఉన్న దుస్తులను చింపిగా అసలు బండారం బయటపడింది. మరోసారి ఇటువంటి పని చేయనని సదరు యువకుడు కాళ్లవేళ్లా పడి బతిమాలినా వదిలిపెట్టలేదు. ఈ తతగంమంతా గమనించిన ఓ కానిస్టేబుల్ హిజ్రాలకు సర్ది చెప్పి యువకుడి కొట్టకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత కానిస్టేబుల్ అక్కడి నుంచి వెళ్లిపోమని ఆదేశించడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Comments

comments