Home జయశంకర్ భూపాలపల్లి పాము కాటుకు బాలుడు బలి

పాము కాటుకు బాలుడు బలి

 
పాముకాటుతో నిద్రలో మృతి
గ్రామంలో అలుముకున్న విషాదం

 

 

మనతెలంగాణ/భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మండలంలోని జంగేడు గ్రామంలో పాము కాటుతో ఓ బాలుడు దుర్మరణం చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరేణి అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే బయ్యగాని క్రాంతికుమార్ పెద్ద కొడుకు నిశాంత్ తల్లిదండ్రులతో మంగళవారం రాత్రి నిద్రలో ఉండగా అతను నురగలు కక్కుతూ అస్వస్థతకు గురయ్యాడు. పాము కరిచిందనే అనుమానంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతిచెందాడు. అతని బెడ్‌లో పాము ఉన్నందున పాముకరిచినట్లు భావిస్తున్నారు. క్రాంతికుమార్‌కు ఇద్దరు కుమారులు ఉండగా పెద్దకొడుకు ఊహించని విధంగా పాముకాటుతో మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. కళ్లముందు తిరగాల్సిన తమ కుమారుడు తెల్లవారగానే మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

 

Boy Dead with Snake Bite in Jayashanker Bhupalapally

 

Boy Dead with Snake Bite in Jayashanker Bhupalapally